అయిజ మున్సిపాలిటీ కేంద్రంలోని బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం మధ్యాహ్నం 12 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి మున్సిపాలిటీలోని పలు కాలనీలలు జలమయమయ్యాయి. దీంతో కాలనీవాసులు ఇబ్బందులకు గురయ్యారు. సరైన డ్రైనేజీ నిర్మాణం మున్సిపాలిటీ లో లేకపోవడంతో కాలనీలో నీరు చేరి ఇబ్బందులకు గురవుతున్నామని తక్షణమే డ్రైనేజీలు నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు .