ద్విచక్ర వాహనాన్ని ఆర్టిసి బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన శనివారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది స్థానికుల కథనం వరకు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలం కేంద్రం అరగొండ చిత్తూరు రహదారిలో గంగవరం మండలం కీలపట్ల కు చెందిన టీ మునీంద్ర తన నానమ్మ నారాయణమ్మతో కాణిపాకం బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న సమయంలో ఆర్టిసి బస్సు ఢీకొంది దీంతో బస్సు వెనుక చక్రం తలపై ఎక్కడంతో తల నుజ్జు అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.