రైతన్నలకు బాసటగా ఈ నెల 9వ తేదీన వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న రైతు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూళ్లూరుపేట మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ కిలివేటి సంజీవయ్య పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని క్యాంపు కార్యాలయంలో వైసీపీ నాయకులతో కలిసి సోమవారం కిలివేటి సంజీవయ్య మీడియాతో మాట్లాడారు. రైతుల సమస్యలను పట్టించుకోని కూటమి ప్రభుత్వంలో చలనం వచ్చేలా మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా రైతు సమస్యలను ప్రభుత్వానికి వివరిస్తూ ఈ నెల 9వ తేదీన వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం