ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఉమ్మడి జిల్లాల సమన్వయకర్త కార్యాలయం కలెక్టరేట్ సమీపంలోకి వచ్చింది. స్థానిక మర్రిచెన్నారెడ్డి భవన ప్రాంగణంలోని DRDA కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ నూతన కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ డా. బి.ఆర్ అంబేద్కర్ ప్రారంభించారు. అందరికీ అందుబాటులో, ప్రభుత్వ భవనంలో కార్యాయలయాన్ని ఏర్పాటు చేయడం పట్ల కలెక్టర్ అభినందించారు. ఈ కార్యక్రమంలో DRDA పి.డి శ్రీనివాసరావు, APSWREI సొసైటీ సమన్వయకర్త ఎస్.రూపవతి, విద్యాలయాల ప్రిన్సిపాళ్లు, బోధన, భోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.