ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలో వైసిపి నుండి భారీగా టిడిపిలో చేరికలు జరిగాయి. శనివారం సాయంత్రం 4గంటలకు గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు సమక్షంలో కొమ్మర, కోడిగుడెంకు చెందిన మాజీ సర్పంచ్ తాండ్ర సురేష్ బాబు వారితోపాటు సుమారు 200 మంది టిడిపి తీర్థం పుచ్చుకున్నారు.వారికి ఆహ్వానించిన ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు..