దివ్యాంగులకు రాజకీయ పదవుల్లో 5 శాతం కోటా కల్పించాలని ఆంధ్రప్రదేశ్ వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మల్లెల లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరుతూ ఆయన, పలువురు దివ్యాంగులతో కలిసి ఎన్టీఆర్ కలెక్టర్ జి. లక్ష్మీశాకు సోమవారం వినతిపత్రం అందజేశారు.దివ్యాంగులు రాజకీయంగా ఎదగడానికి ప్రభుత్వం సహకరించాలని వారు కోరారు.