మరో రెండు రోజుల్లో సిర్పూర్ నియోజకవర్గానికి 1000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అవుతుందని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. మంచిర్యాల రైల్వే స్టేషన్ లో క్రీమ్ కో యూరియా రైలు వచ్చిన సందర్భంగా రైలు నుండి అన్లోడ్ అవుతున్న యూరియా సరళిని ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పరిశీలించారు. అగ్రికల్చర్ కమిషనర్ గోపి ఐఏఎస్ తో మాట్లాడి 1000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరినట్లు ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తెలిపారు,