కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం లో తుఫాన్ ప్రభావంతో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు మరియు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం మరియు ఉదయం నుంచి వర్షం అక్కడక్కడ పడటంతో చేతికొచ్చిన పత్తి పంట మరియు వర్షంలో తడిచే చెడిపోతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని పంటలు అయితే వర్షంలో తడిచి పూర్తిగా దెబ్బతిన్నాయంటూ ప్రభుత్వం వారిని ఆదుకోవాలని రైతులు కోరారు.