రావులపాలెం లో స్త్రీ శక్తి విజయోత్సవ సభ నిర్వహించారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికీ 30 సంవత్సరాలు గడవడంతో కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. అనంతరం ఆయన సభలో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందని మహిళా శక్తి - ఉచిత బస్సు ప్రయాణం అనేది మహిళలకు ఆర్థిక, సామాజిక పురోగతి కల్పించడానికి చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఉన్న సోదరీమణులకు ఇచ్చిన వరంగా పేర్కొన్నారు.