శ్రీ సత్య సాయి జిల్లా పరిగి మండలం వన్నపల్లి చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతురాలికి దాదాపు 60ఏళ్లు ఉంటాయన్నారు. హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.