యూరియా ఎరువుల కోసం రైతుల ఆందోళన చెందవద్దని ఎల్.ఎన్.పేట ఎంపీడీవో శ్రీనివాసరావు సూచించారు. ఎల్.ఎన్.పేట మండలం బొర్రంపేట, తురకపేట గ్రామాల్లో ఆదివారం రైతులతో సమావేశమయ్యారు. వారం రోజుల్లో రైతులకు అవసరమైన యూరియా గ్రామాలకు వస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వీఆర్వో జోగినాయుడు, పంచాయతీ కార్యదర్శి తవిటినాయుడు తదితరులు పాల్గొన్నారు.