ములుగు జిల్లాలో దసరా, సద్దుల బతుకమ్మ పండుగ ముందు మహిళలు ఆడుకునే బొడ్డెమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో మహిళలు పూలతో పేర్చిన బొడ్డెమ్మలను తీసుకొచ్చి ఆయా ప్రాంతాల్లోని పలు ఆలయాలు, వీధుల్లో బతుకమ్మ..బతుకమ్మ ఉయ్యాలో అంటూ పాటలు పాడుతూ బొడ్డెమ్మ వేడుకలను నిర్వహించారు.