గ్రామ పాలన గాడిన పడుతోంది. నూతంగా నియామకమైన గ్రామ పరిపాలన అధికారులు రెండు రోజుల్లో విధుల్లోకి చేరనున్నారు. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న ములుగు జిల్లాకు చెందిన 50 మందికి సోమవారం క్లస్టర్లను కేటాయించే అవకాశం ఉంది. మొత్తం 99 క్లస్టర్లకు గాను 50 పోను మిగతా క్లస్టర్లకు గతంలో వీఆరీలుగా పని చేసి.. రెవెన్యూపై అవగాహన ఉన్న వారికి ఇన్ఛార్జ్లుగా బాధ్యతలు ఇవ్వనున్నారు.