నల్లగొండ జిల్లా తిప్పర్తి మండల కేంద్రంలోని బిజెపి జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో యూరియా కొత్త తీర్చాలని సోమవారం రాస్తారోకోను చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన బ్లాక్ మార్కెట్ తరలిపోతుందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొనకపోతే తిరుగుబాటు చేస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సకాల సమయానికి యూరియాను అందించకపోతే రైతాంగం తిరుగుబాటు చేస్తారన్నారు.