అల్లూరి జిల్లా ప్రజలంతా సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని బాధితులు ఎవరైనా 1930 కి ఫిర్యాదు చేయాలని అల్లూరి జిల్లా ఎస్పీ ధీరజ్ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో జిల్లా ఎస్పీ కాన్ఫరెన్స్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు. ఇటీవల కాలంలో అల్లూరి జిల్లా ఏజెన్సీ వ్యాప్తంగా సైబర్ నేరాలు పెరిగిపోయాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వాట్సాప్ టెలిగ్రామ్ మెసేజ్ లలో వచ్చే గుర్తుతెలియని లింకులు లేదా ఏపీకే ఫైల్స్ లను ఓపెన్ చేయొద్దంటూ సూచించారు.