నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కె) గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు, గ్రామస్తులకు శుక్రవారం జాతీయ విపత్తుల నివారణ సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. కమాండెంట్ అమర్ ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని బృందం అకాల వర్షాలు సంభవించినపుడు, ఇతర ప్రమాదాలు, విపత్కర సమయాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, తీసుకోవాల్సిన రక్షణ చర్యలు, ప్రాణ రక్షణ, తదితర అంశాలపై మాక్ డ్రిల్ రూపంలో అవగాహన కల్పించారు. ఇందులో తహసిల్దార్ సంతోష్ కుమార్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విజయ్ కుమార్ పంచాయతి సెక్రటరీ లక్ష్మణ్ తదితరులున్నారు.