కృష్ణాజిల్లాకు కావలసినంత యూరియా అందుబాటులో ఉందని, రైతులందరికీ సరఫరా చేస్తామని, ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. బుధవారం చల్లపల్లి మండలంలోని లక్ష్మీపురం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, యూరియా పంపిణీని పరిశీలించారు. రైతులు స్కూటర్లలో యూరియా బస్తాలను తీసుకెళ్లడం ఆయన గమనించారు.