అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం కేంద్రంలో ఉన్న ఎంపీడీవో కార్యాలయంలో ఎమ్మెల్యే ఎంపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ టిడిపి కార్యకర్త పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. దీంతో ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఫీల్డ్ అసిస్టెంట్ లను తొలగించిన నేపథ్యంలో భారీ ఎత్తున ఎంపీడీవో కార్యాలయానికి టిడిపి శ్రేణులు చేరుకొని నిరసన వ్యక్తం చేశారు. మనస్థాపం చెందిన టిడిపి నేత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.