గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి పై కూటమినేతలు బుధవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో దాచేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పుడు కర్రలతో వస్తున్నాం రేపు అధికారం రాగానే గోడ్డలి తో వస్తామని కాస్ మహేష్ రెడ్డి రెచ్చగొట్టే వాక్యాలు చేశారని వారు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు సమాజంలో అలజడులు సృష్టించేలా ఉన్నాయని ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ దాచేపల్లి భాస్కర్ కు వినతిపత్రం అందజేశారు.