కులాల మధ్య చిచ్చు పెడుతున్న పేర్ని నాని తీరు అత్యంత దుర్మార్గమని జనసేన పార్టీ మచిలీపట్నం ఇంచార్జ్ బండి రామకృష్ణ ఖండించారు. శనివారం మద్యాహ్నం ఒంటిగంట సమయంలో స్తానిక మచిలీపట్నం జనసేన పార్టీ కార్యాలయంలో ఇంచార్జ్ బండి రామకృష్ణ మిడియా సమావేశం నిర్వహించారు..ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ ను దూషించిన ఆర్.ఎం.పి వైద్యుడు గిరిధర్ పై చట్టపరమైన చర్యలు తీసుకొవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు.