సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కోర్టులో ఈనెల 13న జరిగే జాతీయ మెగా లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జహీరాబాద్ రూరల్ ఎస్సై కాశీనాథ్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో మాట్లాడుతూ కక్షిదారులు క్రిమినల్, సివిల్, ఆస్తి వివాదాలు, కుటుంబపరమైన, బ్యాంకు రికవరీ కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చన్నారు. చిన్నచిన్న కేసుల కోసం విలువైన సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకుండా రాజీ మార్గం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలన్నారు.