మండల సమగ్రాభివృద్ధి కోసం CPM పార్టీ ఆధ్వర్యంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని CPM జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రాపర్తి రాజు పేర్కొన్నారు.సోమవారం మండల కేంద్రంలో CPM మండల కమిటీ సమావేశం కాట సుధాకర్ అధ్యక్షతన సోమవారం జరిగింది.ముఖ్యఅతిథిగా రాపర్తి రాజు మాట్లాడుతూ జఫర్గడ్ సమగ్ర అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని తెలియజేశారు. మండలంలో స్థానిక సమస్యలు అంతర్గత రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మండిపడ్డారు. గ్రామాలలో పారిశుధ్య లోపించి ప్రజలకు సీజనల్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందన్నారు.వెంటనే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.