ప్రకాశం జిల్లా ఒంగోలు పట్టణంలో గురువారం జరిగిన వినాయక చవితి వేడుకలలో స్థానిక ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, ప్రకాశం జిల్లా ఒడా చైర్మన్ షేక్ రియాజ్ పాల్గొన్నారు. పూజా కార్యక్రమాలలో పాల్గొన్న అనంతరం, వారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గణేష్ కమిటీ సభ్యులు ఇరువురిని శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొన్నారు.