కర్నూలు మండలం స్టాంటన్ పురంలో దాదాపు రూ.38 లక్షల వ్యయంతో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి మంగళవారం భూమిపూజ చేశారు. కేడీసీసీబీ ఛైర్మన్ డి.విష్ణువర్ధన్ రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డితో కలిసి పనుల ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. మూడు వార్డులకు కలిపి రూ.1.26 కోట్లతో అభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.