హుజురాబాద్: కాలేశ్వరం ప్రాజెక్టుపై వేసిన గోష్ కమిషన్ నివేదికను ఉపసంహరించుకోవాలంటూ హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సోమవారం మధ్యాహ్నం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టుపై కావాలనే కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ పై పార్టీ అధినేత కేసీఆర్ పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పట్టణంలోని అమరవీరుల స్తూపం వద్ద పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో SC కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్ తోపాటు కార్యకర్తలు పాల్గొన్నారు.