నారాయణపేట జిల్లా కేంద్రంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు మిలాద్ ఉన్ నబీ పండుగలు విజయవంతంగా విధి నిర్వహణలో పోలీస్ విభాగం అందించిన భద్రతా సహకారం పట్ల హిందూ ముస్లిం ఉత్సవ కమిటీల సభ్యులు బుధవారం 11 గంటల సమయంలో పేట జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ ను మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఇరువురు మత పెద్దలు ప్రజల పరస్పర సహకారంతో ఉత్సవాలను విజయవంతంగా శాంతియుతంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు.