మైదుకూరు మండలం వనిపెంట వద్ద ఉన్న పట్టు పరిశ్రమపై ప్రభుత్వం దృష్టి సారించి అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని రైతు సేవాసమితి జిల్లా అధ్యక్షుడు రమణ, మైదుకూరు పట్టణ అధ్యక్షులు రామ్మోహన్ కోరారు.గురువారం వారు మాట్లాడుతూ, 1980లో 13 ఎకరాల విస్తీర్ణంలో 15 మంది ఉద్యోగులతో ప్రారంభమైన ఈ పట్టు పరిశ్రమలో ప్రస్తుతం కేవలం ఇద్దరు ఉద్యోగులు మాత్రమే ఉన్నారని తెలిపారు. పరిశ్రమ అభివృద్ధికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.