విజయవాడ- మచిలీపట్నం జాతీయ రహదారిపై గూడూరు మండలం తరకటూరు వద్ద ఇటుకల ట్రాక్టర్ ను యాక్టివా ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన యువకులను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరూ మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.