శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గన్ మెన్ తలగాపు శంకర్రావు శుక్రవారం రాత్రి గుండె పోటుతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శిరీష ఆదేశాల మేరకు. ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో ఆయన స్వగ్రామమైన పలాస మండలం వీరభద్రపురం లో శనివారం నిర్వహించారు. శంకర్రావు మరణ వార్త విన్న సమీప ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వందలాదిమంది అభిమానులు బంధువులు అంత్యక్రియలు పాల్గొన్నారు.