కుటుంబాల కోసం ప్రతి శనివారం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఫ్యామిలీ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని ఇకపై శనివారంతో పాటు ప్రతి బుధవారం కూడా నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ వి.ఎన్. మణికంఠ చందోలు, ఒక ప్రకటనలో తెలిపారు.కుటుంబాల్లో తలెత్తే మనస్పర్థలను పరిష్కరించి, కలహాలను నివారించడంతో పాటు కుటుంబాలను ఐక్యం చేయాలనే లక్ష్యంతో, జూలై 12న చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్‌లో “ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్” (కుటుంబ సలహా కేంద్రం) ను ప్రారంభించామన్నారు.ప్రతి శనివారం కుటుంబాల కోసం ప్రత్యేకంగా కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నామని, ఈరోజు నుండి ప్రతి బుధవారం కూడా నిర్వహిస్తామని తెలిపారు.