పల్నాడు జిల్లాలో కొత్తగా 54 బార్ అండ్ రెస్టారెంట్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు స్వీకరించారు. శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో పల్నాడు జిల్లా నరసారావు పేటలోని కలెక్టరేట్లో అరుణ్ బాబు చేతుల మీదుగా లాటరీ ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా 49 ఓపెన్ క్యాటగిరీకి 5 గీత కార్మికులకు కేటాయించినట్లు జిల్లా ఎక్స్చేంజ్ అధికారి మణికంఠ తెలిపారు. మున్సిపాలిటీలలో వార్షిక ఫీజు 55 లక్షలు నగర పంచాయతీల్లో 35 లక్షల ఉంటుందన్నారు.