కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రకటించడంపై కర్నూల్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వర్షం వ్యక్తం చేశారు. శనివారం ఉదయం 12 గంటలు కర్నూలు లో విలేకరుల సమావేశం నిర్వహించారు. కర్నూలు కొండారెడ్డి బురుజు పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను మరోసారి ఎగరేసేందుకు తాము కృషి చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్ అన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా కర్నూలు లో అన్ని వర్గాలను కలుపుకుని పార్టీ బలోపేతానికి కృషి తోపాటు ప్రజల కోసం పోరాటం చేస్తామని తెలిపారు.