మహబూబాబాద్ జిల్లా కురవి మండలం తాళ్ల సంకీస గ్రామంలో, విషాదం చోటుచేసుకుంది మేత కోసం వెళ్ళిన ఆరు పశువులు కరెంట్ షాక్కు గురై మృతి చెందాయి. గత రాత్రి వచ్చిన అకాల గాలివాన బీభత్సానికి కరెంటు వైర్లు తెగి కింద పడటంతో, మేత కోసం వెళ్ళిన పశువులు విద్యుత్ షాక్కు గురయ్యాయి, ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.