గణేష్ నిమజ్జనాన్ని పురస్కరించుకొని మంచిర్యాల పట్టణ, శ్రీరాంపూర్ ఏరియా వినాయక నిమజ్జన శోభాయాత్ర రూట్ మ్యాపును కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి గురువారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు ఆటంకం కలగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. హిందూ ఉత్సవ కమిటీ సభ్యులకు తగు సూచనలిచ్చారు. వినాయక మండప నిర్వహకులు సాయంత్రం త్వరగా గణనాధుని వాహనంలో ఎక్కించి మెయిన్ రోడ్డుకు రావాలని తెలిపారు. గణనాథుని శోభాయాత్రకి భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, ఆరోజు ఎలాంటి ఆటంకం వాటిల్లకుండా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు.