సదాశివపేట మండలం పెద్దాపూర్ జాతీయ రహదారిపై ఒక ఆటో పల్టీ కొట్టడంతో అందులో ప్రయాణిస్తున్నవారికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు ఆటోను పక్కకు తీసి, గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.