రెబ్బెన మండలం గోలేటి క్రాస్ రోడ్ వద్ద గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. బెల్లంపల్లికి చెందిన ఓదేలు అనే వ్యక్తి మద్యం సేవించి బైక్ నడుపుతూ అదుపు తప్పి రోడ్డుపై పడ్డాడు. ఈ ప్రమాదంలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా, సిబ్బంది అతడిని బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.