పేద ప్రజలకు రేషన్ సరఫరా చేస్తున్న డీలర్లకు పెండింగ్లో ఉన్న కమిషన్ డబ్బులు వెంటనే విడుదల చేయాలని రేషన్ డీలర్ల సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్ పరిధిలోని జహీరాబాద్, కోహిర్, న్యాల్కల్, జరా సంఘం మండలాల్లో రేషన్ డీలర్లు సోమవారం మధ్యాహ్నం తహసిల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఐదు నెలలుగా డీలర్లకు రావాల్సిన కమిషన్ విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నమన్నారు.వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.