శ్రీకాకుళంలోని ప్రధాన మార్కెట్ ప్రాంగణం మంగళవారం సాయంత్రం కొనుగోలుదారులతో కళకళలాడింది. వినాయక చవితి పండుగకు సంబంధించిన పూలు పండ్లు పత్రి తదితర పూజా సామాగ్రి కొనుగోలు చేసేందుకు భక్తులు మార్కెట్ కు తరలివచ్చారు. ఇదే ప్రధాన మార్కెట్ కావడంతో కొనుగోలుదారులతో సందడి వాతావరణం నెలకొంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా కొందరు మట్టి గణపతుల కోసం ఎగబడ్డారు..