జీడిమెట్ల డిపో ఎదురుగా శుక్రవారం అర్ధరాత్రి గుర్తుతెలియని బస్సు ఢీకొట్టడంతో తెలంగాణ తల్లి విగ్రహం పూర్తిగా ధ్వంసం అయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏర్పాటు చేసిన విగ్రహం ధ్వంసం కావడంతో బాధాకరమని సూరారం డివిజన్ అధ్యక్షుడు పుప్పాల భాస్కర్ అన్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. నూతన విగ్రహం పునః ప్రతిష్టించాలని వారు కోరారు.