పరిటాలలో నాలుగు రోజుల క్రితం వినాయకుడు నిమజ్జనంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హిందూ సంఘాలు సోమవారం ఉదయం 11 గంటల నుండి విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై కంచికచర్లలో ఆందోళనకు దిగారు. ఇదే సమయంలో హిందూ వ్యతిరేక సంఘాలు కూడా అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నందిగామ ఏసీపీ తిలక్ ఆధ్వర్యంలో పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.