నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం నకిరేకల్ మండలాల్లో వేరువేరుగా మండల తహసిల్దార్ కార్యాలయాలు వద్ద రైతాంగానికి యూరియాను అందించాలని డిమాండ్ చేస్తూ అఖిలభారత రైతుకూలీ సంఘం ఏఐకేఎంఎస్ మండల కమిటీల ఆధ్వర్యంలో శనివారం నిరసన వ్యక్తం చేసి కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏఐకేఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అంబటి చిరంజీవి మాట్లాడుతూ వానకాలానికి తెలంగాణ రాష్ట్రానికి 10 లక్షల 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం పడుతుందని అన్నారు. రైతులకు యూరియాను అందించాలని తెలిపారు.