జిల్లాలో వ్యవసాయ సాగుకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, కావున రైతులు అధైర్య పడొద్దని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు.సోమవారం సీతానగరం మండలం సూరంపేట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ సందర్శించి, రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా అక్కడి రైతుల కష్టసుఖాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎరువుల కొరత లేదని, తొందరపడి అధిక ధరలకు కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే జిల్లాలోని రైతులకు ఎరువులను సరఫరా చేశామని, రైతు సేవా కేంద్రాల్లో మరిన్ని నిల్వలు ఉన్నట్లు వివరించారు.