యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు నుంచి గుండ్లగూడ మీదుగా పెబర్తి గేటు వరకు వెళ్లే పాత జనగాం హైవే రోడ్డుకు ప్రభుత్వం వెంటనే మరమ్మతులు చేపట్టాలని సిపిఎం మండల కార్యదర్శి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం పటేల్ గూడెం గ్రామ శాఖ ఆధ్వర్యంలో సిపిఎం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. నాలుగు గ్రామాల ప్రజలు అనునిత్యం ఆలేరుకు ఏ చిన్న అవసరం వచ్చిన అదే రోడ్డు నుంచి ప్రయాణించాలని నిత్యం వందలాదిమంది హైదరాబాదుకు పనుల నిమిత్తం వెళ్తారన్నారు.