కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధి అజ్వేస్టార్స్ కాలనీలోని ఓ ఇంట్లో బుధవారం సిలిండర్ పెరింది. సిలిండర్ పేలడంతో ఇంటిపై కప్పు కూలింది. దీంతో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా అందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. స్థానికులు వారిని చికిత్స నిమిత్తం వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.