టీయూడబ్ల్యూజే ఐజేయు ఇతర జర్నలిస్టు సంఘాల సభ్యత్వాలకు వివిధ పత్రికల్లో పనిచేస్తున్న పాత్రికేయులు ముకుమ్మడి రాజీనామా చేశారు. ఈ మేరకు మంథనిలో డివిజన్ ప్రెస్క్లబ్ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో టి యు డబ్ల్యూ సంఘ ప్రతినిధులు ఏకపక్ష నిర్ణయాలకు విసిగి వేశారడంతో ఆ సంఘానికి దూరంగా ఉండాలని డివిజన్ క్లబ్ సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఇందులో భాగంగా మంథని లో పలువురు జర్నలిస్టులు ఆ సంఘం కు రాజీనామా చేశారు.