కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి గుర్తు తెలియని వ్యక్తి బెదిరింపు లేక పంపిన విషయం తెలిసిందే. దీనిపై కేసు నమోదు చేసిన దర్గామిట్ట పోలీసులు , అల్లూరు కు చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ లేక ఎవరైనా చెబితే ఇచ్చాడా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. రెండు కోట్లు ఇవ్వకపోతే చంపేస్తానని రాసి లెటర్ ఇవ్వడం జిల్లాలో సంచలనం కలిగించింది. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.