మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మానవతా మూర్తి మదర్ తెరిసా 115 వ జయంతిని మహనీయుల స్ఫూర్తివేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజారాం ప్రకాష్ మాట్లాడుతూ నిస్సహాయులకు నిరుపేదలకు అని పంచిన దైవదూత మానవతా మూర్తి మదర్ తెరిసా ను కొనియాడారు ఆమె చూపిన సేవాభావం మనందరికీ ఉండాలని అన్నారు. వనపర్తి జిల్లా కవులు కళాకారులు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.