అనంతపురం నగరాన్ని హరిత అనంతగా మార్చడమే లక్ష్యమని అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో నగరంలోని శ్రీనగర్ కాలనీ నందు మున్సిపల్ కమిషనర్ బాలస్వామి, టిడిపి నాయకులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మొక్కలు నాటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో అనంతపురం నగరాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తున్నామన్నారు. గత 15 సంవత్సరాలుగా శ్రీనగర్ కాలనీలోని 80ఫీట్ రోడ్డు నిర్మాణం లేక ప్రజలు ఇబ్బందులు పడేవారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ రోడ్డు సమస్యను పరిష్కరించామన్నారు.