ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త మరియు గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేయవద్దని ప్రభుత్వాన్ని కోరారు. అనుభవిజ్ఞుడైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తారని ప్రజలు ఆశాభావంతో గెలిపించడం జరిగిందన్నారు. కానీ మెడికల్ కళాశాల నిర్మాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి పేద విద్యార్థులకు వైద్యం దూరం చేసే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించి మెడికల్ కళాశాల నిర్మాణాలను ప్రభుత్వమే పూర్తి చేయాలని కోరారు