నంద్యాల జిల్లా ప్యాపిలిలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని డోన్ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థుల కోసం పాఠశాలలో ప్రత్యేక హెల్త్ క్యాంపును ఏర్పాటు చేయాలని అధికారులను, డాక్టర్ను ఆదేశించారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.